చౌటుప్పల్ జంక్షన్ రింగు విస్తీర్ణాన్ని పెంచొద్దు
గతంలో కోమటిరెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలి
హరీశ్‌రావును కలిసిన ట్రిపుల్ ఆర్ బాధితులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపు ల్ ఆర్) భూ సేకరణలో నష్టపోతున్న రైతులు, బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్‌తో నష్టపోతున్న రైతులు మంగళవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తూ భువనగిరి సభలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో జంక్షన్‌ను 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని రైతులు నష్టపోతున్నారు.
గతంలో జంక్షన్ రింగును 78 ఎ కరాల్లో ప్రతిపాదించగా, ప్రస్తుతం 184 ఎకరా లకు పెంచడంతో నష్టం పెరుగుతుంది. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నా చేశారు.
కానీ ఇప్పు డు పోలీసు బలగాలతో నిర్బంధంగా సర్వే చేసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మాట నిలుపుకునేంత వరకు బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment