ఛండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులతో ములాఖత్ అయ్యారు. శనివారం ఉదయం హర్యానా సోనిపట్‌లో ఆకస్మిక పర్యటన చేసిన ఆయన.. అక్కడి రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో భాగం అయ్యారు. ఆ సమయంలోనే వాళ్ల మంచీచెడులు అడిగి తెలుసుకున్నారు.
స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడి గ్రామాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. స్థానికులతో ముచ్చటించారు. ఆపై పొలంబాట పట్టి ట్రాక్టర్ నడపడంతో.. నాట్లు వేయడంలోనూ హుషారుగా రైతులతో పాల్గొన్నారాయన. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న క్రమంలో.. ఆయన అక్కడికి వెళ్లి ఉంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఇక్కడా ఆయన తన మార్క్ వైట్ టీషర్ట్‌లోనూ కనిపించడం గమనార్హం.
हरियाणा में किसानों के बीच पहुंचे जननायक @RahulGandhi जी। pic.twitter.com/bfX3iUgkxt
— Congress (@INCIndia) July 8, 2023
ఇంతకు ముందు ట్రక్కు నడుపుతూ.. ఆ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్, ఆపై ఢిల్లీ కరోల్‌బాగ్‌లో మెకానిక్ దుకాణాలకు వెళ్లి అక్కడా జన్ కీ బాత్ నిర్వహించారు. భారత్ జోడో యాత్ర.. తదనంతర కర్ణాటక విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపాయి. ఇదే జోష్‌లో రాహుల్ గాంధీ ఇలా సర్‌ప్రైజ్ ములాఖత్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వెరీ డేంజర్
Comments
Please login to add a commentAdd a comment