సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్ ఉల్లంఘిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇక, తాజాగా ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
ఇక, తాజాగా ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి ఫిర్యాదుపై డీఈవోను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యలపై డీఈవోకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. అంతకుముందు కూడా.. రాజకీయ నాయకులు తొందర పడి వ్యాఖ్యలు చేయవద్దు. నేతలు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దన్నారు.
ఇదిలా ఉండగా.. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చింది. దీంతో, కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత నిరంజన్.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కవితపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
VIDEO | "I sincerely request everybody in Telangana to come out and exercise their right because when you vote, you have the right to question us. When you vote, you can hold the politicians accountable," says BRS leader @RaoKavitha after casting her vote in Hyderabad.… pic.twitter.com/Y9BbS3kFtL
— Press Trust of India (@PTI_News) November 30, 2023
Comments
Please login to add a commentAdd a comment