సాక్షి,ఢిల్లీ: కేసీఆర్ అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వివేక్, ఆయన కుమారుడు వంశీ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లోకి రావాలని రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారని వివేక్ చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఢిల్లీ వచ్చి ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం తాము పోటీకి దిగుతామన్నారు. కాగా, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వివేక్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు వంశీ పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వామపక్షాల పొత్తుకు బ్రేక్ పడడం దాదాపు ఖాయమైన తర్వాతే వివేక్‌కు చెన్నూరు సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేషనల్ చీఫ్ ఖర్గేను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment