
హామీల అమలును ఎగ్గొట్టేందుకు వైఎస్సార్‌సీపీపై నిందలు
ఇది చంద్రబాబు దివాలాకోరుతనమే
ఆయన హామీలు అమలు చేయలేరని జగన్ ఆనాడే చెప్పారు
బాబు అసమర్థత వల్లే దావోస్‌లో పెట్టుబడులు రాలేదు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ లెక్కలంటూ.., వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థి క పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు.
చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదు
రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కుమారుడు, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ లేదని చెప్పారు. చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికే దావోస్‌లో ఎంఓయూలు మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారని, ఇలా చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మరి ఎందుకు దావోస్ వెళ్లారని నిలదీశారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా కోటు వేసుకోలేరని, అయినా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ ఎల్లోమీడియా దిగజారుడు రాతలు రాసిందన్నారు.
సీఎంగా వైఎస్ జగన్ దావోస్‌కు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచి్చనవేనని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు. లోకేశ్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైఎస్సార్‌సీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment