సిద్దిపేటజోన్: దేశప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని ఆర్థి క, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో జరిగిన ఇఫ్తార్‌కు ఆయన హాజరయ్యారు. అంతకుముందు ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేశారు. కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. జేడీఎస్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లా సరిహద్దులోని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేస్తే బాగుంటుందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు మంచి స్పందన వస్తోందని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్, కర్ణాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీంతో కలిసి ముందుకెళ్తరని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండగలు, మతాలు, కులాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
అతిపెద్ద సమస్య ఒబేసిటీ
దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో ఒబేసిటీ ఒకటని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో శారీరక శ్రమ ఎక్కువ ఉండేదని, టెక్నాలజీ కారణంగా ఇప్పుడు అది తగ్గిందన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, యోగా, ధ్యానం చేయాలని సూచించారు.
ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరు గంట సమయం కేటాయించాలన్నారు. అంతకు ముందు విపంచిలో విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య వెయ్యికి చేరడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యకు తలమానికంగా ఉందన్నారు. కార్యక్రమాల్లో కర్ణాటక మాజీ కేంద్ర మంత్రి ఇబ్రహీం, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment