
ఈటల జమునను నిలదీస్తున్న శ్రీనివాస్
హుజూరాబాద్: పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మామిండ్లవాడలో ఓ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి జమునను నిలదీశారు. తన కుమారుడు ప్రమాదంలో మృతి చెందగా, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని, ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదని అన్నారు.
ఈ విషయమై ఎన్నో సార్లు వినతిపత్రాలు ఇచ్చినానని, అయినా తనకు సాయం అందలేదన్నారు. రూ.50, 100 విలువ చేసే గడియారాలు పంచుతూ రాజకీయం చేస్తున్నారని గడియారాన్ని పగలగొట్టుతూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment