
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఎక్కడ నడుస్తున్నా ఉపేక్షించేది లేదని.. జూదం ఆడేవారిలో ఎంత పెద్దవాళ్లున్నా వదలి పెట్టేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. జూద శిబిరాల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉంటారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తాను ఆదేశాలిస్తేనే గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేసి.. జూదరులను పట్టుకున్నారని చెప్పారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఎంత మాత్రం సహించబోమని అన్నారు. పేకాట క్లబ్బులపైనే ఆధారపడి బతికిన చరిత్ర చంద్రబాబు, దేవినేని ఉమాదేనని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment