సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2022 విజయనామ సంవత్సరమని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రతి ఇంటా అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరంగా ఆయన చెప్పారు. ఈమేరకు మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఈ ఏడాది పేద వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం. చంద్రబాబుకు ఏడుపు మిగిల్చిన సంవత్సరంగా అభివర్ణించారు. బూతులు తిట్టుకుంటూ మాట్లాడే అయ్యన్న, అచ్చెన్నలాంటి వాళ్లకి బూతులనామ సంవత్సరంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. పేద వారికి విద్య, వైద్య, ఆరోగ్యంపరంగా విజయనామ సంవత్సరం అని పేర్కొన్నారు.
'వచ్చే సంవత్సరం మరిన్ని మేలైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం. 2023 చంద్రబాబు, పవన్‌లకు పచ్చిబూతులు ఎలా తిట్టాలని ట్రైనింగ్ అయ్యే సంవత్సరంగా మారబోతోంది. అభివృద్ధి అంటే చంద్రబాబుకో, తన కులానికో జరగటం కాదు. ప్రతి పేదవారికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలి. పవన్ కల్యాణ్ కూడా ఈ సవాల్ స్వీకరించాలి. కందుకూరు ఘటనకు బాధ్యుడు చంద్రబాబు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబుని అరెస్ట్ చేయాలి' అని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment