సాక్షి, నెల్లూరు: ధాన్యం కొనుగోలుపై నా మాటలను ఈనాడు పత్రిక వక్రీకరించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు కష్టమని నేను చెప్పలేదు. అందరూ వరి పండిస్తే రైతులకు తలకు మించిన భారం అవుతుందని చెప్పాను. అలా కాకుండా లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయమని సూచించామన్నారు.
'మార్గదర్శిలో దోచుకొంటున్న రామోజీ గురువింద సామెతలా వ్యవహరిస్తున్నారు. దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?. సిగ్గుమాలిన వార్తలు ఎలా రాస్తున్నారు. చంద్రబాబుని అర్జంట్‌గా సీఎంని చేయాలన్నదే రామోజీ అజెండా. అలా అని తప్ప్పుడు వార్తలు రాసి బురదజల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని' హెచ్చరించారు.
చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తే ఏనాడైనా వార్త రాశావా రామోజీ అని ప్రశ్నించారు. ఎవరి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారో చర్చిద్దాం. దమ్ముంటే చంద్రబాబుని తీసుకొనిరా అని సవాల్ విసిరారు. పత్రికలు ప్రజాహితం కోరి వార్తలు రాయాలే తప్ప ఇలాంటి తప్పుడు వార్తలు రాయకూడదంటూ మీడియా ముందు క్లిప్పింగులను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రదర్శించారు.
చదవండి: (‘లోకేష్ సంక్షేమం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు’)
Comments
Please login to add a commentAdd a comment