
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. ఇటీవలే గుడ్ గవర్నెన్స్‌లో మేము మొదటి స్థానంలో నిలిచాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌పైనే.. నేడు అధికారంలో ఉన్నా జగన్ పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు.
చదవండి: (ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లు)
పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కాదు.. టీడీపీ రోడ్ మ్యాప్‌లో వెళ్లున్నారు. కౌలు రైతులు అంటూ టీడీపీ ఇచ్చిన మ్యాప్‌లో వెళ్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై పవన్ ఎందుకు స్పందించలేదు. మా పెట్టుబడి సాయం పథకమే రైతు భరోసా.. మీరు భరోసా ఇచ్చేదేంటి..?. విత్తనం నుంచి విక్రయం వరకూ మా ప్రభత్వుం రైతు వెన్నంటే ఉంది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా కౌలు రైతుల కార్డులు ఇచ్చాం. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయలేదు. కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని ఏనాడైనా కేంద్రానికి లేఖ రాశారా?. పవన్‌ది ఆవేశపూరిత రాజకీయం.. జగన్‌ది అర్థవంతమైన రాజకీయం' అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment