సాక్షి, హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? అని మండిపడ్డారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు.
అల్లా దయతో ఇవన్ని జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రుష్టిస్తున్న హింసకాండనుంచీ విముక్తి పొందాలని అసిద్దం.
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామన్నారు.
చదవండి: Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా?
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022
ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.
చదవండి: Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment