
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అసదుద్దీన్‌కు పిచ్చి పట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను యూటీ( యూనియన్ టెర్రిటరీ( కేంద్రపాలిత ప్రాంతం))చేస్తారని పార్లమెంట్‌లో మాట్లాడటం సరికాదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన లేదన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఎంఐఎం, టీఆర్‌ఎస్‌కు అలవాటని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment