న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో పట్టుబడిన దాదాపు 200 కోట్ల రూపాయల నగదు బీజేపీది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆ డబ్బు బీజేపీదే అంటూ ఆరోపించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ డబ్బు తమ పార్టీ నాయకులది కాదని తాము గట్టిగా చెబుతున్నామని, అఖిలేశ్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో ఐటీ దాడులు చేస్తే అఖిలేశ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు.
కచ్చితమైన సమాచారం ఆధారంగానే ఐటీ దాడులు జరిగాయని, ఎటువంటి పొరపాటు లేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ ఎగవేసిన వారి ఇళ్లలోనే ఐటీ సోదాలు జరిగాయన్నారు. వీటిపై అఖిలేశ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే ఆయన పాకులాడుతున్నారని విమర్శించారు. అధికారులను అనుమానించడం మానేసి.. పన్నులు ఎగవేసి కోట్లాది రూపాయలు కూడబెట్టిన వారి బండారం బయటపెట్టాలన్నారు. (ఐటీ దాడులు: పుష్ప రాజ్ అనుకొని.. పీయూష్ ఇంటికా?)
‘ఐటీ అధికారులు పొరపాటున అత్తరు వ్యాపారి ఇంట్లో సోదాలు చేశారని అంటున్నారు. మరైతే అప్పుడు దొరికిన డబ్బు అంతా ఎక్కడ నుండి వచ్చింది? ఆ డబ్బు ఎవరిదో మీకెలా తెలుసు? మీరు అతని భాగస్వామా? ఎందుకంటే ఎవరి డబ్బును ఉంచుకున్నారో భాగస్వాములకు మాత్రమే తెలుసు. ఒక మామూలు ఇంట్లో 23 కిలోల బంగారం దొరుకుతుందా? ఒకవేళ ఈ ఉదంతంతో అఖిలేశ్‌కు ఎటువంటి సంబంధం లేకపోతే వెంటనే ఖండించాల’ని నిర్మలా సీతారామన్ అన్నారు.(చదవండి: డొక్కు స్కూటర్‌పై తిరుగుతూ భలే షాకిచ్చాడే!)
Comments
Please login to add a commentAdd a comment