పవర్‌లేని పవర్‌ స్టార్‌.. జనసైనికులకు గర్వభంగం! | Pawan Kalyan Behavior Angered Janasena Workers | Sakshi
Sakshi News home page

పవర్‌లేని పవర్‌ స్టార్‌.. జనసైనికులకు గర్వభంగం!

Published Mon, Dec 25 2023 7:53 AM | Last Updated on Mon, Dec 25 2023 8:20 AM

Pawan Kalyan Behavior Angered Janasena Workers - Sakshi

తిన్నంతసేపు విస్తారాకు అంటారు.. తినేసాక ఎంగిలాకు అంటారు. అచ్చం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను సైతం.. ఎన్నికలకోసం పవర్ స్టార్ అనడమే తప్ప పవర్ మాత్రం ఇచ్చేది లేదని టీడీపీ మరోమారు తేల్చేసింది. పాపం జనసైనిక్స్.. మీరు సీఎం సీఎం అని అరవడమే కానీ.. మీకు టీడీపీ పావలా విలువ కూడా ఇవ్వడం లేదు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దించేస్తాం.. అధికారంలోకి వస్తాం.. అని కలలుగంటున్న జనసైనికులకు నారా లోకేష్‌ గట్టి షాకే ఇచ్చాడు. పవన్‌ సీఎం అవుతాడనే కలలు చాలని వారిని నిద్రలేపేశాడు. మా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పేశాడు. పోనీ.. సీఎం కాకున్నా డిప్యూటీ అయినా ఇస్తారేమో అని ఎదురుచూసిన సైనికులకు మరోసారి ఝలక్‌ ఇచ్చాడు. ఆ డిప్యూటీ సీఎం అంశం కూడా మా పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుందని బాంబు పేల్చేశాడు. 

అంటే చంద్రబాబు దృష్టిలో పవన్ జస్ట్ ఓ మరమనిషి అన్నమాట. వాళ్ళు చెప్పినట్లు చేయడం స్విచ్ ఆపగానే వెళ్లి ఓ మూలకు కూర్చోవడం. అదే ఆయనకు ఇచ్చిన గౌరవం అని చెప్పేశారు. దీంతో జన సైనికులు చెస్.. ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్లు మా పవర్ స్టార్ పవరంతా చంద్రబాబుకు ధార పోయాడమేనా అని వాపోతున్నారు. అయితే.. మా శ్రమ, సమయం కేవలం టీడీపీ గెలుపుకోసమేనా.. చివరకు మాది జెండా కూలీ బతుకేనా అన్న ఆగ్రహం వారిలో బయటకు వస్తోంది. మాకు, మా నాయకుడికి ఏమాత్రం గౌరవం లేని పార్టీతో పొత్తు ఎందుకు ఆన్న ఆవేదన, అసహనం వారిలో వ్యక్తమవుతోంది. పోనీలే.. అప్పటివరకూ జెండాలు మోయండి కూలీ డబ్బులు గిట్టుబాటు అవుతాయి.

మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చింది గుర్తు చేసుకుంటున్నారు. కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఎన్నో పదవులు కాపులకు ఇచ్చి వారిని సీఎం జగన్‌ గౌరవించారు. కాపుల అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారు. ఇప్పుడు చెప్పండి జనసైనికులారా.. మీరు  ఇంకా అక్కడ ఊడిగం చేయడం అవసరమా? ఆ  గట్టునుంటారా... ఈ గట్టుకొస్తారా? మీరే తేల్చుకోండి!.

 - సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement