సాక్షి, తిరుపతి: ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా?. చంద్రబాబు తనదని చెప్పుకోవడానికి ఒక్క స్కీమూ లేదు. ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు పూర్తి చేశారా?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘సంక్షేమమంటే వైఎస్సార్, వైఎస్ జగన్ గుర్తుకు వస్తారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తున్నాం. ఇసుక టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుకకు కొరత లేదు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకువచ్చాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిచాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా లేదా..? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి’’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి నిలదీశారు.
చదవండి: చంద్రబాబు ప్లాన్ అట్టర్‌ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది!
Comments
Please login to add a commentAdd a comment