సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో 90శాతం పల్ప్ ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు బంధువులవే. పల్ప్ కంపెనీలన్నీ సిండికేట్ అయి ధరలను ధరలను తగ్గించాయి. ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని'' ఆగ్రహం వ్యక్తం చేశారు.
''మామిడి రైతులు ప్రతి రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడటంతో మామిడి ధరలు తగ్గిపోయాయి. అవసరానికి మించి దిగుబడి ఉంటే ధర తగ్గడం కామన్. 9 రూపాయలకు కిలో చొప్పున ఉన్న ధరలు.. 4 రూపాయలకు పడిపోయింది. మ్యాంగో బోర్డ్ ఏర్పాటు ప్రతిపాదనలు సీఎం జగన్ కేంద్రానికి పంపడం జరిగింది.నేను వ్యాపారం చేయడానికి ఫ్యాక్టరీ పెట్టలేదు.. నాకు సంబంధించిన తోటల కోసమే సింగిల్ లైన్ ఫ్యాక్టరీ పెట్టాను.మా వాటా నీళ్లు మేం తీసుకుంటాం.. అక్రమంగా నీళ్లు తీసుకోము.అక్రమ ప్రాజెక్టు మేము కట్టడం లేదు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా జగన్‌కు చెప్పారు. ఆ సమావేశంలో నాతో పాటు కామెంట్ చేసిన తెలంగాణ మంత్రి కూడా ఉన్నారు. రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని స్వయంగా కేసీఆర్ చెప్పారు'' అని తెలిపారు.
చదవండి: భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్ని నాని
Comments
Please login to add a commentAdd a comment