సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లతో మాజీమంత్రి హరిరామజోగయ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కాపు రిజర్వేషన్ల పేరుతో నాటకమాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మంత్రివర్గంలో హరిరామజోగయ్య మంత్రిగా పనిచేసినప్పుడు కాపులను ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. కాపుల అభ్యున్నతి కోసం ఏనాడూ పాటుపడని ఆయన ఇప్పుడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల స్క్రిప్ట్ మేరకే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర హక్కులను హరిస్తున్న బీఆర్‌ఎస్
ఇక బీఆర్‌ఎస్ పార్టీపై పేర్ని నాని స్పందిస్తూ.. దేశంలో పిరమిడ్ పార్టీ గతంలో అన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిందని.. అలాగే, కేఏ పాల్ పార్టీ రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీచేసిందని.. అదే రీతిలో 175 స్థానాల్లోనూ బీఆర్‌ఎస్ పోటీచేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్‌తో ఆ పార్టీ పోటీపడుతుందంటూ ఎద్దేవా చేశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరిస్తున్నది బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి బీఆర్‌ఎస్ ఇక్కడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తుందో చెప్పాలని నాని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, పవన్‌లతో మ్యాచ్‌ఫిక్సింగ్
Published Tue, Jan 3 2023 5:09 AM | Last Updated on Tue, Jan 3 2023 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment