సాక్షి, అమరావతి: అమిత్‌షా, మోదీతో నీకు నిజంగా బంధం ఉంటే డేటా చోరీని నిరూపించాలని.. దీనిపై కేంద్ర సంస్థలతో విచారణ చేయించుకో అంటూ పవన్‌కు మాజీ మంత్రి పేర్ని నాని ఛాలెంజ్ విసిరారు.
గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీఏ వస్తుందని అంటున్నావు. ఈ అఖండ ప్రజలు ఎవరు? ఇదేమైనా అఖండ సినిమానా?. హాలీడే ట్రిప్పుకు వచ్చి ఈ మాటలేంటి పవన్?. ఏ పొత్తులో ఎవరి వాటా ఎంత?. డమ్మీ పొత్తా? జనాలను నమ్మించడానికి పెట్టుకున్న పొత్తా?’’ అని ప్రశ్నించారు.
పవన్‌కు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. వల్లంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు.. వారి మానసిక స్థైర్యం దెబ్బతినేలా పవన్ మాట్లాడాడు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేస్తున్నారన్నారు.
చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం
‘‘పవన్ సొల్లు కబుర్లు చెబుతున్నారు. తప్పుడు మాటలు రుజువైతే కోర్టే పవన్‌ను అరెస్ట్ చేయిస్తుంది. రాజకీయాల్లోకి వస్తే బరి తెగించి మాట్లాడొచ్చన్నది పవన్ ఆలోచన. డేటా చౌర్యం అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు డేటా చోరీ చేసినప్పుడు ఏం చేశావ్ పవన్?. అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఇవాళ రంకెలేస్తూ మాట్లాడుతున్న పవన్.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. పవన్‌కు రిస్క్ ఏముంది? నీపై పెట్టుబడి పెట్టిన బాబుకే రిస్క్’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
‘‘ప్రజాసాధికారిక సర్వే పేరుతో బాబు డేటా చోరీ చేస్తే ఏమైపోయావ్?. ఏపీ ప్రజల డేటాను బాబు ప్రైవేట్ కంపెనీకి అమ్మేస్తే ఏం చేశావ్?. పార్టీ సభ్యత్వం పేరుతో నువ్వు సేకరిస్తున్న డేటా ఎవరికిస్తున్నావ్?. సభ్యత్వం కోసం ఫోన్ నంబర్, ఓటర్ ఐడీ, ఈ-మెయిల్ ఎందుకు?’’ అని నాని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment