
సాక్షి, అమరావతి: చంద్రబాబు మేలు కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. బుధవారం ఆయన ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారు. పవన్ మాట్లావేవన్నీ అసత్యాలే. పవన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానని చెప్పాడు. సంతోషం నీ ముసుగు తీశావు. విడివిడిగా కాదు.. కలిసే రండి. కాపులందరూ సీఎం జగన్ వైపే ఉన్నారు. చిరంజీవిపై పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. పార్టీ పెట్టి మూసింది ఎవరు?. రాజకీయం కోసం అన్న అని కూడా చూడవు. పవన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానంటున్నాడు.. గతంలో ప్రజారాజ్యంలో పని చేయలేదా?. పీఆర్పీ ఓటమి తర్వాత చిరంజీవిని ఒంటరిని చేయలేదా?. 2014లో కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర పెట్టావు. చంద్రబాబు దమ్ము లేక పవన్‌ను వాడుకుంటున్నాడు’’ అని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స
Comments
Please login to add a commentAdd a comment