
న్యూఢిల్లీ: దేశంలో విద్వేషాన్ని మరింత పెంచేందుకు బీజేపీ.. ‘విద్వేష కర్మాగారాలు’ నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శ చేశారు. ఆ కార్ఖానాల్లో ‘ టెక్ ఫాగ్’ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం హిందీలో ట్వీట్లు చేశారు. ‘ ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసి, వారిపై అంతగా విద్వేషం పెంచుకున్న బుల్లి బాయ్ యాప్ నిర్వాహకుడు చాలా తక్కువ వయసు వాడు. యువతలో విద్వేషం పెంచేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో విద్వేషం ఎక్కడి నుంచి వెదజల్లబడుతోందని యావత్ భారతావని ఆశ్చర్యంలో మునిగిపోయింది. నిజానికి బీజేపీ ఇలాంటి ఎన్నో కర్మాగారాలను నడుపుతోంది’ అని రాహుల్ ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment