
కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే న్యాయస్థానాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించిన నారా లోకేశ్‌పై న్యాయస్థానాలే సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. లోకేశ్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తణుకులో లోకేశ్ చేసిన విమర్శ కూడా న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా ఉందన్నారు.