Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Telugu Breaking News Online Evening News Roundup 12th September 2022 | Sakshi
Sakshi News home page

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Sep 12 2022 6:03 PM | Updated on Sep 12 2022 7:03 PM

Sakshi Telugu Breaking News Online Evening News Roundup 12th September 2022

భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది.

1. జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం
జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.కాలిపోతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నిక్కర్.. కాంగ్రెస్ ఫోటోపై రాజకీయ దుమారం
భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..
పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన  క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆడిట్‌  నిర్వహించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌..
కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉందని, మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవొద్దని బిల్లులో చెప్పారంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్ పంపిన బ్రిటన్ రాణి
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘కృష్ణంరాజు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తుంటే వింతగా చూసేవారు!’
యండమూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటి వద్ద ఉండి సినీనటుడు కృష్ణంరాజు పాఠశాల విద్యనభ్యసించారు. 9, 10వ తరగతి వరకూ పెద్దాపురప్పాడు హైస్కూల్‌లో చదువుకున్నట్టు ప్రజలు చెబుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాల్గొనే టీమిండియా ఇదే
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి కిందే ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి రోహిత్‌ శర్మ నాయకుడిగా, కేఎల్‌ రాహుల్‌ ఉప నాయకుడిగా వ్యవహరించనున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ముద్ద‌ ముట్ట‌ని పెంపుడు కుక్క‌లు! ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి ‘రతన్‌ టాటా’ డుమ్మా!
అత్యధిక కాలం బ్రిటన్‌ను పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 అస్తమయం కావడంతో  యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ నియమితులు అయ్యారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కృష్ణంరాజు మృతి.. వెక్కెక్కి ఏడ్చిన జయప్రద
‘రెబల్‌’ స్టార్‌ కృష్ణం రాజు మృతిపై సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పబ్స్‌‍పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు
నగరంలోని పబ్స్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement