
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో హడావుడిగా ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వస్తోందో చెప్పాలని, ఎవరి డైరెక్షన్‌లో మీరు ఎన్నికలు నిర్వహిద్దామనుకుంటున్నారని మండిపడ్డారు.
అమరావతి పేరు చెప్పి రూ.7,200 కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేకపోయారని చంద్రబాబుపై మండిపడ్డారు. అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించి రైతులను నట్టేట ముంచారన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి పథకాన్ని పక్కదారిపట్టించి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment