
సాక్షి, తిరుపతి: ‘బీసీలకు టీడీపీలో ప్రాధాన్యత లేదు. ఇకపై కూడా ఇవ్వరు. చంద్రబాబు బీసీలను దగా చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. అటువంటి పార్టీలో ఉండలేను. టీడీపీకో దండం’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం తన పదవికి రాజీనామా చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు బీసీలను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కష్టపడి పని చేసినా బీసీలకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. బడుగుల నాయకత్వం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీసీలను ప్రోత్సహించడం లేదని చెప్పారు. టీడీపీ నేతల వ్యవహారశైలి చూస్తుంటే.. భవిష్యత్‌లో కూడా బీసీల పట్ల వివక్ష కొనసాగేలా కనిపిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment