సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకుగానూ గురువారం రూ.167.59 కోట్లు చెల్లించింది. ఆర్థిక శాఖ నుంచి ఈ నిధులు విడుదల అయ్యాయి.
తొలి దఫాలో 37 వేల రూపాయల నుంచి 41 వేల రూపాయల మధ్య ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసింది. తద్వారా 44,870 మంది రైతులకు లబ్ది చేకూర్చినట్లయ్యింది. మరోవైపు ఇది ఎన్నికల ముందర చేస్తున్న స్టంట్‌గా బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment