వివక్ష ఎందుకు? బండి సంజయ్‌ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి కదా?: కేటీఆర్‌ | Telangana: Minister KTR Comments On BJP Chief Bandi Sanjay | Sakshi
Sakshi News home page

వివక్ష ఎందుకు? బండి సంజయ్‌ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి కదా?: కేటీఆర్‌

Published Mon, Jun 6 2022 12:44 AM | Last Updated on Mon, Jun 6 2022 10:55 AM

Telangana: Minister KTR Comments On BJP Chief Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఏ మతానికి చెందిన వారిపైనైనా బహిరంగంగా విష ప్రచారం చేయడాన్ని బీజేపీ ఖండిస్తుంది’అంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ బీజేపీ తరపున విడుదల చేసిన పత్రిక ప్రకటనపై మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు. ‘బీజేపీ అన్ని మతాలను గౌరవించినప్పుడు మసీదులు తవ్వుతామని, ఉర్దూ నిషేధిస్తామని వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి కదా?

చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఈ తరహా వివక్ష? నడ్డా గారూ మీ వివరణ ఏంటి’అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్‌ భగీరథను కేంద్ర ప్రభుత్వం తమదిగా నిర్లజ్జగా చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా నయాపైసా ఇవ్వలేదని, ఇప్పడు మాత్రం తమ ఘనతగా చెప్పుకోవడం ఎన్డీయే ప్రభుత్వానికి సిగ్గుచేటని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement