ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తోంది.. త్వరలో షెడ్యూల్ అనే బాజా భజంత్రీలు మోగనున్నాయి. ఈలోపు రాజకీయ పార్టీలు తమ ఎత్తులు.. పొత్తులు.. జిత్తులతో సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు మాత్రం తమ పార్టీ విధానాన్ని, వ్యూహాన్ని క్యాడరుకు కాస్త చెప్పారు.. బీజేపీతో పొత్తు ఉంటుందని.. ఇక జనసేనలో ఎలాగూ ప్రయాణం ఉంటుందని.. అంటే మూడుపార్టీలూ కలిసి వెళ్తాయని చెప్పారు. ఇదే క్రమంలో పార్టీలోని వాళ్లు.. త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పారు.. అంటే మూడు పార్టీలు కలిసి వెళ్తాయి కాబట్టి అటు జనసేనకు, బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లలో టీడీపీ నాయకులూ త్యాగాలు చేయాలనీ చెప్పారు.
ఇదే తరుణంలో అసలు అభ్యర్థుల ఎంపికకు సైతం చాలా సమయం పడుతుందని అప్పుడే సీట్ల గురించి కంగారు పడొద్దని అయన చేసిన అభ్యర్థులు, ఆశావహుల్లో నైరాశ్యాన్ని నింపింది.. అసలే అటు వైఎస్ జగన్ జెట్ స్పీడులో సభలు సమావేశాలు.. సమీక్షలు.. అంటూ పార్టీని ముందుకు ఉరికిస్తుంటే ఇటు ఎక్కడ ఎవరికీ సీట్ అన్నది కూడా ఇంకా తేల్చకపోతే ఇంకా తామెప్పుడు ప్రచారం చేస్తాము.. ఇంకెప్పుడు ఎన్నికలకు వెళ్తాం అని వారు కలవరపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఐదేళ్లుగా పార్టీని మోస్తున్న తమను కాదని ఇప్పుడొచ్చిన జనసేన, బీజేపీలకు ఎలా టిక్కెట్లు ఇస్తారని కొందరు టీడీపీ నాయకులూ ఆందోళన చెందుతున్నారు.. ఎక్కడ తమ స్థానం కూడా మిత్ర పక్షాలకు వెళ్లిపోతుందేమో అని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. మరికొందరు మాత్రం అసలు ఈ ఎత్తులు పొత్తులు ఎందుకు విజయమో వీర స్వర్గమో సొంతంగా సింగిల్‌గా పోటీ చేస్తే ఆటో ఇటో తేలిపోతుందని ఎవర్నీ దేబిరించే అవసరం ఉండదు అని.. కొందరు అంటున్నారు.. కానీ పొత్తుల్లేకుండా వెళితే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని కొందరు భయపడుతున్నారు.
మరోవైపు లోకేష్ చేస్తున్న యాత్రలు.. టూర్లు కూడా పెద్దగా మైలేజి ఇవ్వడం లేదని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు తెలిసింది.. అలాగని ఆయన్ను ఇంట్లో కట్టేసి ఉంచితే ఊరుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతాను. ప్రజల్లో ఉంటాను.. అని చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది.. దీంతో అయన మాట కాదనలేక అలా జిల్లాల టూర్లకు పంపుతున్నారు. అటు ఈయన మీటింగుల్లో చేసే కామెంట్లు.. వ్యాఖ్యలు ఘోరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయని.. ఆయన అపరిపక్వత మరింతగా జనానికి తెలుస్తుందని, అటు నియోజకవర్గ ఇంఛార్జులకు ఖర్చుతప్ప పార్టీకి లాభం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు..
-సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!
Comments
Please login to add a commentAdd a comment