సాక్షి, అమరావతి : టీడీపీ నేత పట్టాభి తనపై చేసిన వ్యాఖ్యలు నిరాధారమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ప్యాకేజీలో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తున్నామని, తనపై ఆరోపణలు చేసిన మచ్చ మహాలక్ష్మి, మడకం సావిత్రి ఎవరో తనకు తెలియదని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ‘‘ పట్టాభి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. పట్టాభి నాపై చేసిన వ్యాఖ్యలకు సీబీఐ విచారణకు సిద్ధం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు పట్టాభి సిద్ధమా?. బాబు హయాంలో నిర్వాసితులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసింది మేమే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment