
సాక్షి, హైదరాబాద్: యాత్ర పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు టీపీసీసీ పోస్టర్ విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా తాను పాదయాత్ర చేయనున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. రూట్ మ్యాప్ వర్కవుట్ నడుస్తుందన్నారు. నిరంతరాయంగా పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
రేవంత్‌తో భేటీకి సీనియర్లు డుమ్మా!
గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి షబ్బీర్ అలీ, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లు సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. ఈ భేటీకి సీనియర్లు హజరవ్వకుండా నిరసన వ్యక్త చేశారు. రేవంత్‌తో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే సీనియర్ల తీరును రేవంత్ వర్గీయులు తప్పుబడుతున్నారు. కమిటీల కూర్పుపై అభ్యంతరాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 13 మంది రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment