
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరైన గుణపాఠం చెప్పక తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూకు వెళ్లకుండా తమ నేత రాహుల్ గాంధీని అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఓయూకు రావాలని దళిత, గిరిజన విద్యార్థులు ఆహ్వానించారని రేవంత్ తెలిపారు.
వీసీ అనుమతి అడిగితే 18 మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్ట్ చేశారన్న రేవంత్.. అధికారం ఉందని పోలీసులతో పాలన చేయాలంటే కుదరదన్నారు. అధికారులను నిబంధనల ప్రకారం పని చేయనివ్వడం లేదని శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ మండిపడ్డారు. ఇది కేసీఆర్ పతనానికి నాంది అని విమర్శించారు రేవంత్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment