సాక్షి, హైదరాబాద్: బీజేపీపై సీఎం కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్‌పై బీజేపీకి కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ బహిరంగా సవాల్‌ను కేంద్రం తరపున స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌తో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ పనితీరుపై చర్చ చేద్ధామని పిలుపునిచ్చారు. ఏడున్నరేళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిన దానిపై చర్చిద్దామన్నారు. అయితే చర్చలో కేసీఆర్ సరైన భాష మాట్లాడాలని షరతు విధిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
హుజురాబాద్ ఎన్నికతో టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యానని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎవరూ మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ కుటుంబం సహించడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, భాష అభ్యంతరకరంగా ఉందన్నారు.
చదవండి: ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. అస్సాం సీఎంపై కేసు నమోదు
‘పాకిస్తాన్‌లో అభినందన్ అనే యుద్ధ వీరుడు పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించాం. ఉచిత కరెంట్ రైతులకే కాదు, అన్ని వర్గాల వారికి ఫ్రీ ఇచ్చినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదు. మోటర్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన కేంద్రానికి లేదు. యూరియాపై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తోంది. త్వరలో మోడీ తెలంగాణ పర్యటన ఉంది. రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారు. యూరియా సబ్సిడీ గత ఏడాది 79వేలు. ఈ ఏడాది 1లక్ష కోట్లు పెట్టాము. గతంలో పోల్చితే ఈ సారి 30శాతానికి పైగా సబ్సిడీ పెంచాము.
బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరు. టీఆర్‌ఎస్్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అవుతారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై నిర్ణయాలు జరుగుతాయి. బెంగాల్‌లో ఏం జరుగుతుందో తెలుసా కేసీఆర్? గత ఏడేళ్లుగా మతకలహాలు లేవు. బాంబ్ పేలుళ్లు లేవు. కర్ఫ్యూలు లేవు. ఈశాన్య రాష్ట్రాల్లో నెలలపాటు రోడ్లని మూసివేసి ఉండేవి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల శాంతితో ముందుకు వెళ్తున్నాయి’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment