Upliftment Of Tribals Is The Mission Of AP State Government - Sakshi
Sakshi News home page

గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం 

Published Wed, Jul 26 2023 5:11 AM | Last Updated on Wed, Jul 26 2023 9:16 PM

Upliftment of tribals is the mission of AP state government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ఆర్డర్‌ 5వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడైనా గిరిజనులకు మేలు చేకూర్చే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్‌సీపీ సమర్థి­స్తుందని, సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పా­రు.

అంతకుముందు సభలో టీడీపీ సభ్యుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన నివాసిత ప్రాంతంలోనే నెలకొల్పేం­దు­కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొర­వ చూపారని తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి ­మోదీ­ని ఒప్పించారని గుర్తుచేశారు.

గిరిజన విశ్వవిద్యా­లయం ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరా­ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమ­కూ­ర్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీ భవనా­లు, క్యాంపస్‌ నిర్మా­ణం ప్రారంభమయ్యా­యని చెప్పా­రు. అనాదిగా వైద్య, ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోని గిరిజనుల కోసం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన వైద్యకళాశాల నిర్మా­ణం చేపట్టారన్నారు.

పోడు వ్యవసాయమే గిరిజను­ల జీవనాధారం అయినందున అటవీహక్కుల గుర్తింపు చట్టం కింద పోడుసాగు చేసే భూములకు పట్టా­లు పంపిణీ చేసే కార్యక్రమానికి అప్పటి ఆంధ్ర­ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకా­రం చుట్టారని గుర్తుచేశారు. 1.30 లక్షల ఎకరాల్లో  55 వేలమంది గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పోడుసాగు చేసే గిరిజనులకు తిరిగి పట్టాల పంపిణీ ప్రారంభించారని చెప్పారు.  

ఎస్టీ జాబితాలోకివాల్మికి, బోయ కులాలను చేర్చాలి 
మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మికి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని విజయసాయిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేంద్రం తుది నిర్ణ­యం తీసుకోవాల్సి ఉందన్నారు.

రాజ్యాంగంలో­ని ఆర్టికల్‌ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనా­భా ప్రాతిపదికన రిజర్వేష­న్లు కల్పించారని, దాని ప్రకారం ఎస్టీ జాబితా­లోని కులాలకు 7 శా­తం రిజర్వేషన్‌ ఇచ్చా­రని చెప్పారు. కొత్తగా ఏవై­నా కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్‌ పరిమితి పెంచాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు.

మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్‌సీపీ తొలినుంచి డిమాండు చేస్తోందని చెప్పారు. లోక్‌సభ నుంచి మొదలుపెట్టి స్థానిక సంస్థల వరకు మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వు చేయ­డం వలన గిరిజనులకు వారికి కేటాయించిన 7 శాతం రిజర్వేషన్‌ కాకుండా అదనంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని తెలిపారు.  

కనకమేడల ప్రసంగానికి ఖండన  
అంతకుముందు చర్చలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఏపీలో స్థితిగతులంటూ పే­ర్కొ­నడా­న్ని విజయసాయిరెడ్డి ఖండించారు. బిల్లు గురించి మా­­త్రమే మాట్లాడాలని ఉప సభాపతి హరి­వంశ్‌ పలుసార్లు చెప్పినప్పటికీ రవీంద్రకుమార్‌ తన ప్రసంగం తీరు మార్చుకోలేదు. చివరికి ప్రసంగం తీరు మార్చుకోకు­ంటే మరో సభ్యుడికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుం­­దని ఉప సభాపతి స్పష్టం చేశారు. బిల్లుయేతర అంశాలు పరిశీలించి వాటిని రికార్డుల నుంచి తొలగిసా­్తమని విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement