సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడంలో ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో ఏర్పడిన నూతన రాష్ట్రాలకు ఏ చట్టంలో ఉందని ప్రత్యేక హోదా కల్పించారో చెప్పాలని సోమవారం పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఎగ్గొట్టడానికి ఆ పార్టీ కుంటిసాకులు చెబుతోందన్నారు.
ప్రత్యేక హోదాపై ఏం చేశారని రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోందని.. చట్టం చేసింది కాంగ్రెస్.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది టీడీపీ అని గుర్తుచేస్తూ.. కానీ, వైఎస్సార్‌సీపీని ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించి న విజయసాయిరెడ్డి ఇటు అధికార బీజేపీని హోదా పై ఘాటుగా ప్రశ్నిస్తూనే టీడీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. అంతకుముందు.. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు విజయాలు, ప్రాధామ్యాలు వివరిస్తూ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి్డ తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన తన ప్రసంగంప్రారంభించారు.
ప్రత్యేక హోదాపై ..
అధికారంలోకి వచ్చిన త ర్వాత వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంలేదంటూ ఆరోపించడం టీడీపీకి దినచర్యగా మారిందని విమర్శించా రు. సభ సాక్షిగా కొన్ని వాస్తవాలు తెలపాల్సి ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడుసార్లు ప్రధాని మోదీ తో, 12సార్లు హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారని, ప్రతిసారీ హోదా అంశాన్ని ప్రస్తావిం చారని గుర్తుచేశారు. ఇటీవల తిరుపతిలో నిర్వహిం చిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులోనూ అమిత్‌షాను హోదా గురించి డిమాండు చేశారన్నా రు. ఈ అంశంపై చర్చకు గత పార్లమెంట్ సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చి ఉభయ సభలను స్తంభింపచేశామని గుర్తుచేశారు.
బీజేపీ కుంటిసాకులివే..
ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడానికి కేంద్రం కుంటిసాకులు చెబుతుందని విజయసాయిరెడ్డి తెలి పారు. ఏపీకి ఇస్తే జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలూ డిమాండ్ చేస్తాయని కేంద్రం చెబుతోందన్నారు. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినా ఏ రాష్ట్రం రాజధానిని కోల్పోలేదన్నా రు. కానీ, విభజనకు గురైన ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయిందన్నారు. అలాగే.. ‘‘విభజనకు గురైన ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెం ట్ సాక్షిగా ప్రధానమంత్రి వాగ్ధానం చేశారా? ఏపీకి హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కా దా?.. అలాగే, ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. ఆర్థిక ప్రా తిపదికన ఏపీకి హోదా ఇస్తే వెనుకబడిన ఒడిశా, బిహార్‌లూ హోదా కోసం డిమాండ్ చేస్తాయన్న కారణాన్ని కేంద్రం చూపిస్తోంది. ఒడిశా, బిహార్‌లు ఆర్థికంగా వెనకబడిన వాస్తవం నాడు మన్మోహన్ సింగ్‌కు తెలియదా?’’ అని ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్‌కు ఇచ్చారు కదా..
ఇక విభజన చట్టంలో ఎక్కడా ‘హోదా’ ప్రస్తావనే లే నందున మంజూరు చేయలేమని కేంద్రం చెబుతోందని.. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్ విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదాను ఇవ్వలేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఒక న్యాయమా అని ఆయన నిలదీశారు. అలాగే.. ‘హోదా’ రాజకీయంగా సాధ్యపడే అంశం కాదనడం కేంద్రానికి సరికాదని తెలిపారు. గతేడాది పాండిచ్చేరి ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని అనలేదా అని ప్రశ్నించారు.
హోదాకి ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు
హోదా బదులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, హోదాకి ప్ర త్యేక ప్యాకేజీ ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కా దని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు.. ఏపీతోపాటు విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 164వ నివేదికలో సిఫార్సు చేసినందున ఇప్పటికైనా ఏపీకి హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
నికర రుణ సేకరణపై ఆంక్షలా!?
మరోవైపు.. ఏపీ నికర రుణ సేకరణ పరిమితిని త గ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు హయాం లో పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఇప్పుడు ఏపీని శిక్షించడం తగదన్నారు. నికర రుణ సేకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఏపీ ఎంత మెరుగ్గా ఉందో వివరించారు. 2019–20లో కేంద్రం ద్రవ్యలోటు 4.6 శాతం ఉంటే, ఏపీలో 4.1 శాతం, 2020–21లో కేంద్రంలో లోటు 9.2 శాతం ఉంటే ఏపీలో 5.4 శాతం, 2021–22లో కేంద్రంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండగా ఏపీలో 3.5 శాతం ఉందన్నారు. వాస్తవాలు గమనించి ఏపీ నికర రుణ సేకరణ పరిమితిపై ఆంక్షలు తొలగించాలని కోరారు.
హోదాపై కేంద్రం ద్వంద్వ వైఖరి
Published Tue, Feb 8 2022 5:10 AM | Last Updated on Tue, Feb 8 2022 5:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment