సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు ప్రజలు లొంగేవారైతే బాబే శాశ్వత సీఎంగా ఉండే వారంటూ ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి.. ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు.. ‘‘డబ్బు, మద్యం, బెదిరింపులకు ప్రజలు లొంగేవారైతే నువ్వే శాశ్వత సీఎంగా ఉండే వాడివి చంద్రబాబూ. అవి నీ మార్క్ నీచ రాజకీయాలు. 40% పంచాయతీల్లో గెలిచానని చెబుతూనే అధికారుల గుడ్డలు ఊడదీస్తానంటున్నావు. ఈ బలుపే కదా నిన్ను 23కి చేర్చింది. వార్డు సభ్యులను కూడా సర్పంచ్‌లుగా లెక్కేసినట్లున్నావ్’’అని ట్వీట్ చేశారు.
అదే విధంగా ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో.. ‘‘టీవీ చర్చలో తన పార్టీ నాయకుడు బిజెపి నేతపై చెప్పుతో దాడి చేయడం చూసి చంద్రబాబు ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడు. ఆయన కోరుకునేది ఇలాంటివే. పంచాయితీ ఎన్నికల్లో కనీసం పది ప్రాణాలైనా పోలేదని నిరాశ చెంది ఉంటాడు. టీవీ స్క్రీన్ మీదే అయినా దాడి దృశ్యం హుషారు తెప్పించి ఉంటుంది!’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
చదవండి: ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment