సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఇతర నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై డీజీపికి వైఎస్సార్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.
దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం: అంబటి
అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టుల కాపీలను డీజీపీకి అందజేశాం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల విషయాన్ని డీజీపీకి వివరించాం. ఏపీలో జరుగుతున్న దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా పోస్టులను డీజీపీకి ఇచ్చాం. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరాం. మా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా డీజీపికి ఫిర్యాదు చేశాం. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, అవినాష్‌రెడ్డి ఇతరులపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వివరాలు కూడా డీజీపికి ఇచ్చాం. మా వారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తాం. ఆడబిడ్డపై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూస్తాం. మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తాం. తర్వాత కోర్టును ఆశ్రయిస్తాం
కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే చంద్రశేఖర్
చిన్న విషయాలకే పోలీసులు కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారంటే నాపై కేసు పెట్టారు. మంచినీటి కంటే ఎక్కువగా మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై నిర్బంధ కేసు పెట్టారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం కాకుండా ఇంకెవరు అడుగుతారు? పేకాట క్లబ్‌లను ఎందుకు కట్టడి చేయడం లేదు?. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment