
సాక్షి, చిత్తూరు: తిరుపతి ఉపఎన్నికపై చర్చించామని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ఉపఎన్నికపై వైఎస్సార్‌సీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపఎన్నికపై సమాలోచనలు చేశారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తిరుపతి బై ఎలక్షన్‌పై చర్చించాము. మా అభ్యర్థి ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాము. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే మేము ప్రచారం చేస్తాం. గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించటమే లక్ష్యంగా పనిచేస్తాము. మేము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి’అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాధరెడ్డి, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటేగౌడ్, ఎంపీ రెడ్డెప్పలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment