కంభంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
కంభం: స్థానిక తర్లుపాడు రోడ్డులోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ప్లాట్లలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని కందులాపురం కాలనీకి చెందిన శ్రీనుగా గుర్తించారు. మృతుడు హోటళ్లలో పనిచేసుకుంటూ ఖాళీ సమయంలో ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంటాడని తెలిసింది. మృతుడు వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు. అసలు అక్కడికి ఎందుకు వెళ్లాడు? మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
పెట్రోల్ దాడిలో గాయపడిన మహిళ మృతి
పెద్దదోర్నాల: స్థలం విషయమై దాయాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందింది. పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం పంచాయతీలోని తూర్పుపల్లెలో శుక్రవారం వేకువజామున చలిమంట వద్ద ఉన్న నాగూరువలి, నూర్జహాన్‌బీపై దాయాదులైన దూదేకుల ఖాశింవలి, అతని కుటుంబ సభ్యులు పెట్రోల్ క్యాన్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన నాగూర్‌వలి మృతి చెందగా, నూర్జహాన్‌బీ శుక్రవారం అర్ధరాత్రి ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ప్రత్యర్థులు జరిపిన పెట్రోల్ దాడిలో 80 శాతం కాలిన గాయాలైన నూర్జహాన్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెంటున్నర స్థలం విషయమై దాయాదుల పిల్లల మధ్య జరిగిన గొడవల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
కంభంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment