
జగన్ హయాంలో మహిళలకు స్వర్ణయుగం
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రాష్ట్రంలోని మహిళలకు ఒక స్వర్ణయుగంగా మిగిలిపోతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మహిళల సంక్షేమం కొనసాగిందన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ చేయూత, తదితర పథకాల పేరుతో మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేశారని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నింటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించారని, పరిపాలనలో పెద్దపీట వేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఓ దళిత మహిళలకు హోంశాఖ మంత్రిగా నియమించిన ఘనత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకురావడమే కాకుండా దిశ చట్టాన్ని అమలు చేశారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను విస్మరిస్తోందని, అనేక రకాల వాగ్దానాలు చేసి అమలు చేయకుండా మహిళలను నిట్టనిలువునా మోసం చేశారని విమర్శించారు. జగనన్న పాలనలో కడుపులోని బిడ్డ నుంచి వందేళ్ల వృద్దుల వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఆనాడు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత విధానాలను మహిళలు నిలదీయాలన్నారు.
మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయంగా, పరిపాలన పరంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో ఏకంగా ఆరుగురు మహిళలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించారన్నారు. మహిళలు ముందడుగు వేస్తేనే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని భావించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మ్యానిఫెస్టోను అటకెక్కించి చేసిన హామీల్లో ఒక్కదానిని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఒట్టి చేతులు చూపుతున్నారని విమర్శించారు. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మీ పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. సీ్త్రనిధి నిధులను పక్కదారి పట్టిస్తూ దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలను మహిళలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న 2.0 లో కార్యకర్తలకే పెద్దపీట వేయనున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాడాలన్నారు.
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళల సాధికారిత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రశ్నించాలని సూచించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకుడు నూకతోటి శరత్‌కుమార్ ఆలపించిన జయహో మహిళ పాట ఆకట్టుకుంది. జిల్లాలోని మహిళా నాయకులు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండెపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడికొండ జయంతి, మహిళా నాయకురాలు భూమిరెడ్డి రమణమ్మ, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పి.ప్రసన్న, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, అంగన్‌వాడీ అధ్యక్షురాలు గోవిందమ్మ, మద్దిపాడు ఎంపీపీ అరుణ, తమ్మినేని సుజాతారెడ్డి, నియోజకవర్గ అంగన్‌వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, మేరికుమారి, సయ్యద్ అప్సర్, ఎస్.రమణమ్మ, జ్యోతి, మాధవి, బి.రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం
పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్

జగన్ హయాంలో మహిళలకు స్వర్ణయుగం
Comments
Please login to add a commentAdd a comment