
జాతరకు పటిష్ట ఏర్పాట్లు
సిరిసిల్ల: మహాశివరాత్రి జాతరకు వేములవాడలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎస్పీ అఖిల్‌మహాజన్, వేములవా డ ఆలయ ఈవో వినోద్‌రెడ్డిలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈనెల 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని కోరారు.
అదనపు సెల్‌టవర్లు.. 857 బస్సులు
సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని టెలికాం ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవ ర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ డిపోల నుంచి 857 బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. 20 లక్షల లీటర్ల నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 500 మంది పారి శుధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వే ములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పేర్కొన్నారు. 8 అగ్నిమాపక వాహనాలు, ఇప్పటికే 260 సీసీ కెమెరాలు ఉండగా మరో 180 కెమెరాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలి పారు. 24 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. 3 లక్షల లడ్డూలు సిద్ధం చేయనున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. గుడిచెరువు ప్రాంతంలో భక్తులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రోడ్లపై గుంతలు పూడ్చండి
● వేములవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
● జాతర విధుల నిర్వహణకు వచ్చే సిబ్బందికి, ముఖ్య అతిథులకు వసతిసౌకర్యం కల్పించాలని సూచించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
● తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చలివేంద్రాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
● ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్, జగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
● వేములవాడ పరిసరాల్లో మద్యం విక్రయాలు నిషేధించాలన్నారు.
● సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలీసులకు వసతి కల్పించాలి
జిల్లా ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ గతం కంటే ఎక్కువగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, అక్కడ పోలీసుల కోసం టెంట్, తాగునీటి సరఫరా ఉండాలని సూచించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, డీపీవో శేషాద్రి, డీటీవో లక్ష్మణ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జెడ్పీ సీఈవో వినోద్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ఎస్.రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్, వేములవాడ టౌన్, రూరల్ సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర
భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

జాతరకు పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment