
నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 32 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 68 మంది ఆమోదించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది 38 నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ రిజెక్ట్ అయింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. సరైన ఫార్మాట్‌లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఏవో నరేందర్, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేశ్ దూత్ ఎక్క హాజరయ్యారు.
అనుమతి లేని భవనం కూల్చివేత
వేములవాడరూరల్: వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లిలో అనుమతి లేకుండా అదనంగా నిర్మించిన స్లాబ్‌ను అధికారులు కూల్చివేశారు. సదరు యజమాని జీప్లస్ టూ అనుమతి తీసుకుని అదనంగా మరో స్లాబ్ నిర్మించారని ఓ వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా, యజమానికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణం కూల్చివేయాలని కోర్టు తీర్పు చెప్పడంతో మంగళవారం మున్సిపల్, ఫైర్ అధికారులు కూల్చి వేశారు.
ఫేక్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్లటౌన్: ట్రేడ్ లైసెన్సు చెల్లించాలంటూ వస్తున్న ఫేక్ కాల్స్‌పై పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఉద్యోగుల పేరుతో కొందరు ట్రేడ్ లైసెన్స్‌ల కోసం 81060 26047 నంబర్, ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లైసెన్సు తీసుకోవాలని షాప్ యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని, అధికారిక వెబ్‌సైట్స్, మున్సిపల్ కార్యాలయంలో మాత్రమే ఫీజు చెల్లించాలని కోరారు. ఫేక్ కాల్స్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
సిరిసిల్ల: ఆశ కార్యకర్తలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆశ నోడల్ పర్సన్స్‌తో సమీక్షించారు. సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, సీహెచ్‌వో శాంత, బాలచంద్రం పాల్గొన్నారు. అంతకుముందు పట్టణ ఆరోగ్య కేంద్రం, తంగళ్లపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఆరోగ్య సేవలో జిల్లాను ముందుంచాలని సూచించారు.
మిడ్‌మానేరులో 20 టీఎంసీలు
బోయినపల్లి: మిడ్‌మానేరులో 20.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం ఎల్‌ఎండీకి 2,500, కుడి కాల్వ ద్వారా 300, ఎడమకాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి

నామినేషన్ల పరిశీలన పూర్తి
Comments
Please login to add a commentAdd a comment