
పీఎంశ్రీ స్కూళ్లలో పనులు పూర్తి చేయండి
సిరిసిల్ల: జిల్లాలో పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా)పథకంలో ఎంపికై న పాఠశాలల్లో అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించా రు. మంగళశారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో 16 స్కూల్స్ పీఎంశ్రీలో ఎంపికయ్యాయని, వాటిలో మౌలిక వసతులు ఫర్నిచర్, ఇంటర్నెట్, టచ్ స్క్రీన్, శుద్ధమైన తాగునీరు, కంప్యూటర్లు, సైన్స్‌ల్యాబ్ పరికరాలు, కిచెన్ గార్డెన్, సోలార్ పవర్ ప్యానెల్స్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి సన్నద్ధం చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల గురుకుల బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో సౌకర్యాలు, మెనూపై ఆరా తీశారు. తరగతి గదులు, కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రిన్సిపాల్ సృజన, ఉపాధ్యాయులు ఉన్నారు.
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా

పీఎంశ్రీ స్కూళ్లలో పనులు పూర్తి చేయండి
Comments
Please login to add a commentAdd a comment