
ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన ఉండాలి
● సీపీవో, మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి
సిరిసిల్ల: కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి, మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ నోడల్ అధికారి పీబీ శ్రీనివాసాచారి కోరారు. జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం ప్రిసైడింగ్, సహా య ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొదటి విడత శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పక్రియ కొంత భిన్నంగా ఉంటుందని వివరించారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, గడువులోపు క్యూ లైన్‌లో ఉన్నవారికి టోకెన్ నంబర్లు అందించి ఓటింగ్ చేయించాలన్నారు. 26న ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని, పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాస్టర్ ట్రైనర్లు పి.మహేందర్‌రెడ్డి, శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. జిల్లాలో పీవోలు 42, ఏపీవో 42, ఓపీవో 97, మైక్రో అబ్జర్వర్స్ 17 మందిని కేటా యించగా, కామన్ పోలింగ్ కేంద్రాలు 7, జనరల్ కేంద్రాలు 27 ఏర్పాటు చేయనున్నారు. శిక్షణలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment