
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క, పాముకాటు వ్యాక్సిన్‌లతోపాటు అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పీహెచ్‌సీలను బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికా ర్డులు పరిశీలించారు. వైద్యసిబ్బంది హాజరు రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, మండల వైద్యాధికారి సారియా అంజుమ్, పీహెచ్‌ఎన్ రజినీ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదులో ముందుండాలి
సిరిసిల్లటౌన్: సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ ముందంజలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో జిల్లాను ముందుంచా లని మహిళా కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జి కృష్ణవేణి కోరారు. డీసీసీ ఆఫీసులో బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఏఎంసీ చైర్మన్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షురాలు వెలు ముల స్వరూప, నాయకులు కోడం అరుణ, మడుపు శ్రీదేవి, గట్టు రుక్మిణి, సత్యలక్ష్మి, హారిక, లహరి, సత్యప్రసన్న పాల్గొన్నారు.
‘బీసీలకు రిజర్వేషన్లపై సిద్ధం’
సిరిసిల్లటౌన్: బీసీ కులగణనతో వెనుకబడినవర్గాల అభ్యున్నతిపై కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి చాటిందని ఆ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, బీఆర్‌ఎస్ కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, నాయకులు రాగుల జగన్, బీమారం శ్రీనివాస్, కమలాకర్‌రావు, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, కిరణ్, రాము పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలోనే సుభిక్షం
వేములవాడరూరల్: కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కాంగ్రెస్ ఏడా ది పాలనలో అవస్థలు పడుతున్నారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. వేములవాడ రూరల్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కోరారు.

మందులు అందుబాటులో ఉంచుకోవాలి

మందులు అందుబాటులో ఉంచుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment