
నియమావళిని అమలు చేయండి
● అనుమానాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి ● మాస్టర్ ట్రెయినర్లు ● ఆర్‌వో, ఏఆర్వోలకు శిక్షణ
సిరిసిల్ల: ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నియయాలు అమలు చేయాలని మాస్టర్ ట్రెయినర్లు సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్‌లో బుధవారం రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్‌వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌వో)లకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రెయినర్లు మాట్లాడుతూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలని, నియమ, నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్‌బుక్ చదువుకోవాలన్నారు. సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపులు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు మోడల్ తదితర అంశాలపై 10 మంది మాస్టర్ ట్రెయినర్లు వివరించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో ఎం.గీత, మాస్టర్ ట్రెయినర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment