మహాజాతర ఏర్పాట్లు పరిశీలన
● ఉత్సవాల సమయంలో ఉద్యోగులకు సెలవులు రద్దు
వేములవాడ: మహాశివరాత్రి జాతర కోసం చేస్తున్న పనులను ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, అధికారులు బుధవారం పరిశీలించారు. కోడెల క్యూలైన్, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిళ్ల పనులను పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా ఆలయ ఉద్యోగులెవరూ సెలవులు పెట్టుకోవద్దంటూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజన్న హుండీని ఈనెల 19న లెక్కించనున్నట్లు తెలిపారు. ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, మైపాల్‌రెడ్డి, ఏఈ రాంకిషన్‌రావు, లక్ష్మణ్‌రావు, ఏఈవో శ్రావణ్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, సంజీవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment