వేధింపులకు గురిచేస్తే చర్యలు
కరీంనగర్‌క్రైం: యువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు కాగా, గతేడాది 40 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
– శ్రీలత, ఉమెన్ టౌన్ సీఐ,
షీటీం ఇన్‌చార్జి, కరీంనగర్
ప్రేమ.. రెండక్షరాలు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.
● ప్రేమించి,
పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న జంటలు
● ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న
కొన్ని గ్రామాలు
● ముందు కెరియర్.. తర్వాతే ప్రేమ.. పెళ్లి అంటున్న నేటి యువత
● నేడు ప్రేమికుల దినోత్సవం
పెద్దలను ఒప్పించాలి
పేరెంట్స్‌ను గౌరవించే సంస్కారం లేని వాళ్లు పార్ట్‌నర్‌ను గౌరవిస్తారనే గ్యా రంటీ లేదు. కాబట్టి, ప్రేమ అనివార్యమైనప్పుడు పెద్దలను ఒప్పించేంత స్వచ్ఛత దానికి ఉండాలి. అలాంటి ప్రేమే నిలబడుతుంది. – కార్లెన్
ప్రశ్న: బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?
జవాబు: బర్డ్ ఫ్లూ హైపోజెనిక్ ఏవియర్ ఇన్‌ఫ్లూయెంజా అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఇది సాధారణంగా కోళ్లలో కనిపిస్తుంది. ఒక కోడికి వ్యాధి సోకితే మిగతా వాటికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోళ్లఫారాల్లో కోళ్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోతుంటాయి. ఈ వైరస్ ఇప్పటివరకు మన జిల్లాలో విస్తరించలేదు.
ప్రశ్న: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు: కోళ్ల ఫారాలకు ఇతరులను రానీయొద్దు. యజమానులు సైతం మాస్కులు ధరించి వెళ్లాలి. కోళ్లను తెచ్చే, తీసుకుపోయే వాహనాలు, కోడిగుడ్ల వాహనాలను పూర్తిగా శానిటేషన్ చేశాకే లోపలికి అనుమతించాలి. కోళ్లు ఉండే ప్రదేశాలను సైతం తరచూ శానిటేషన్ చేస్తుండాలి. చనిపోతే పడేయకుండా గోతి తవ్వి పూడ్చాలి. లేదంటే దహనం చేయాలి.
ప్రశ్న: వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
జవాబు: బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల తల వాపుగా ఉంటుంది. ముక్కులో నుంచి ద్రవాలు కారుతుంటాయి. కోళ్లు శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడుతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో ఉంటాయి. ఆహారం తీసుకోవడం మానేస్తాయి.
ప్రశ్న: మనుషులకు సోకే అవకాశం ఉందా?
జవాబు: ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ మూలంగా మనుషులు చనిపోయిన దాఖలాలు లేవు. కానీ, జాగ్రత్తగా ఉండాలి. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, చికెన్ తినకూడదు.
ప్రశ్న: మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ర్యాపిడ్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక వెటర్నరీ డాక్టర్, ఒకరు పారా వెటర్నరీ సిబ్బంది ఉంటారు. జిల్లాలో 14.50 లక్షల కోళ్ల కెపాసిటీ ఉన్న 126 పౌల్ట్రిఫామ్స్ ఉన్నాయి. సంబంధిత యజమానుల ఫోన్ నంబర్లు తీసుకొని, ఎప్పటికప్పుడు వారిని చైతన్యపరుస్తాం. ఎటువంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కోడానికి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
న్యూస్‌రీల్
వేధింపులకు గురిచేస్తే చర్యలు
వేధింపులకు గురిచేస్తే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment