ప్రేమనగర్.. మరిమడ్ల
కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్‌లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment