సాగు నీరు విడుదల
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ‘జల‘వెల.. విలవిల’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి, నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో, ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా శివారులోని మైసమ్మ చెరువును నింపుతున్నారు. ఈ చెరువు తూము ద్వారా రాచర్లతిమ్మాపూర్, బాకూర్‌పల్లితండా, రాచర్లగొల్లపల్లి, దేవునిగుట్టతండా, అల్మాస్‌పూర్, అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా గ్రామాల పరిధిలోని ఆయకట్టు భూములకు సాగు నీరందించనున్నారు. రెండు రోజుల్లోనే పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు చేరనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేటితో ముగియనున్న ‘సహకార’ పదవీకాలం
సిరిసిల్ల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ పదవీకాలం నేటితో ముగియనుంది. అయితే, పదవీ కాలం పొడిగిస్తారా.. పర్సన్ ఇన్‌చార్జిలను నియమిస్తారా.. అనే అంశంపై స్పష్టం లేదు. జిల్లాలోని మొత్తం 24 సంఘాల్లో 74,728 మంది సభ్యులుండగా.. 35,776 మందికి ఓటు హక్కు ఉంది. ఒక్కో సహకార సంఘంలో 13 డైరెక్టర్ స్థానాలున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తారా.. పర్సన్ ఇన్‌చార్జిలను నియమిస్తారా అనే విషయమై అధికారిక సమాచారం లేదని జిల్లా సహకార అధికారి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని పేర్కొన్నారు.
ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి
● డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి
సిరిసిల్ల: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బాధ్యతలను పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదన్నారు. ఏ సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు అనువుగా ఉండే పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకొని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ పక్రియలను చేపట్టాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పించినా అన్నింటినీ పరిశీలించాలని పేర్కొన్నారు. ఆర్వోలు 194, మంది ఏఆర్వోలు 75 మంది హాజరయ్యారు. డీఎల్‌పీవో నరేశ్, మాస్టర్ ట్రైనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌పై బురదజల్లడం మానుకోవాలి
● మాజీ ఎంపీ వినోద్‌కుమార్
సిరిసిల్లటౌన్: మాజీ సీఎం కేసీఆర్‌పై బురదజల్లడం మానుకొని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం నీరందించే పనిలో పని లో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హితవు పలి కారు. గురువారం సాయంత్రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో చిన్న లోపం తలెత్తితే రిపేర్ చేయించకుండా కేసీఆర్‌ను బద్నాం చేయడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని సముద్రం పాలు చేయకుండా ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులో లోపం వస్తే రూ.5 వేల కోట్లతో పునఃనిర్మాణం చేస్తున్నారని, వారిలాగే ఇక్కడి ప్రభుత్వం బాధ్యతగా మెదలాలని సూచించారు. రైతులకు యూరియా అందుబాటులో లేదని, వెంటనే ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు రామ్మోహన్, రాఘవరెడ్డి, మల్లారెడ్డి తదితరులున్నారు.
సాగు నీరు విడుదల
సాగు నీరు విడుదల
సాగు నీరు విడుదల
Comments
Please login to add a commentAdd a comment