ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కాగా ఒకరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం గమనార్హం. తాజా ఉపసహంరణలు పోగా.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల పోటీలో 56 మంది అభ్యర్థులు మిగిలారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు ఉపసంహరించుకోగా.. 15 మంది బరిలో నిలిచారు.
విత్‌డ్రా చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు
గవ్వల లక్ష్మి, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కావూరి సత్యనారాయణగౌడ్, ఆలగొండ కృష్ణహరి, నాలకంటి యాదగిరి, బడే నరసయ్య, లింగాల శ్రీనివాస్, రేకల సైదులు, మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేందర్, దార మనోహర్
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
గవ్వల శ్రీకాంత్
పెండింగ్ వేతనాలివ్వాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మి కుల వేతనాలు గత జూలై నుంచి నవంబర్ వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమా ండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసినా జిల్లాకు చెందినవారికి ఇవ్వ డం లేదని ఆరోపించారు. కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జీపీ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment